అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శాన్ ఫెర్నాండో వ్యాలీలో వార్తా కవరేజ్ కి వెళ్లిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అంతకుముందు అదే ప్రాంతంలో కారు, మెట్రో బస్సు ఢీకొన్న ప్రమాదాన్ని కవర్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాట్స్‌వర్త్‌లోని ఎన్ మేసన్ అవెన్యూ 9100 బ్లాక్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. కారు, బస్సు ప్రమాదంలో ఇద్దరుమృతిచెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద స్థలంలో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్న సమయంలోనే హెలికాప్టర్ కూలిపోయింది.
హెలికాప్టర్‌లోని కెమెరా ఫుటేజ్ ప్రకారం.. కూలిపోవడానికి కొద్దిసేపటి ముందు విమానం అదుపు తప్పి రెండు కమర్షియల్ బిల్డింగుల మధ్య, కార్లు, షిప్పింగ్ కంటైనర్ల పై హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున భారీగా మంటలు చెలరేగాయి.
లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఎంతమంది ఉన్నారనే విషయం వెంటనే స్పష్టంగా తెలియలేదు. శిథిలాల్లో మరెవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ హెలికాప్టర్ ఓ టెలివిజన్ స్టేషన్‌కు చెందినదని స్థానిక మీడియా పేర్కొన్నప్పటికీ.. ఏ స్టేషన్‌కు చెందినదో అధికారికంగా నిర్ధారించలేదు. ప్రమాదంపై లాస్ ఏంజిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
BREAKING: KNBC helicopter crashes while covering metro bus crash in Los Angeles, California. pic.twitter.com/TgzkkVTBHx
— AZ Intel (@AZ_Intel_) September 16, 2026
