యుద్ధంతో భయపడని బంగారం.. గురువారం ఎంత తగ్గిందంటే..?

యుద్ధంతో భయపడని బంగారం.. గురువారం ఎంత తగ్గిందంటే..?

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ బంగారం, వెండి రేట్లు ఆకాశాన్ని తాకుతాయనే కంగారులో పడ్డారు. కానీ అందరి ఊహలూ ప్రస్తుతం తారుమారు అవుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లలో రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పటికీ రిటైల్ లో మాత్రం స్థిరంగా రోజురోజుకూ ధరల పతనం కొనసాగుతోంది. ఈ క్రమంలో గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేయాలని అనుకుంటున్న వాళ్లు తమ సిటీల్లోని తాజా రేట్లను పరిశీలించి ముందుకెళ్లండి. 

మార్చి 5న బంగారం రేట్లు భారీగా తగ్గి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో మార్చి 4 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.98 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 353గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 990గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : గల్ఫ్ యుద్ధ మేఘాలు.. గ్యాస్కు గోసే.. ధరలు పెరిగే ఛాన్స్ !

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 5, 2026న దేశవ్యాప్తంగా రేట్లలో మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 95వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.295 వద్ద ఉంది.