ఐసీఏఆర్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 3.ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–II1, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ –II 2.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పీహెచ్డీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి. 12వ తరగతి, డిప్లొమాతోపాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మార్చి 16.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.ivri.nic.in ను సందర్శించండి.
