అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీపై ఎటాక్.. జవాన్ వీరమరణం.. మరో నలుగురికి గాయాలు

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీపై ఎటాక్.. జవాన్ వీరమరణం.. మరో నలుగురికి గాయాలు

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యంపై దాడి జరిగింది. చాంగ్లాంగ్ జిల్లాలోని భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి గస్తీ కాస్తోన్న అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అస్సాం రైఫిల్స్ జవాన్ మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన జవాన్‎ను హవిల్దార్ జంఖోకై కుకీ (42) 

సరిహద్దు కంచె పనులు జరుగుతున్న ప్రాంతంలో 21 అస్సాం రైఫిల్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా నంపాంగ్ సర్కిల్ పరిధిలోని నంపాంగ్ నల్లా సమీపంలో మంగళవారం (సెప్టెంబర్ 29) ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ జవాన్ మరణించగా.. నలుగురు గాయపడ్డారు. గాయపడ్డ సిబ్బందిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

►ALSO READ | ప్రముఖ వెబ్ సిరీస్ నటి అరెస్ట్ : వ్యభిచార ముఠా లీడర్ గా పోలీసులు గుర్తింపు

ముష్కరుల దాడి నేపథ్యంలో ఘటన స్థలంలో భద్రతా దళాలు ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఈ దాడి వెనక ఎన్‌ఎస్‌సిఎన్ (కె-వైఎ)కు చెందిన మిలిటెంట్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, దాడి చేసిన వారి గుర్తింపు గురించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఈ ఘటనపై అస్సాం రైఫిల్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని చాంగ్లాంగ్ ఎస్పీ కిర్లీ పాడు తెలిపారు.