వయసు పెరిగిన సరే.. యంగ్‌గా కనిపించాల ? వృద్ధాప్యాన్ని రాకుండా చేసే సీక్రెట్ హెల్త్ టిప్స్ ఇవే!

వయసు పెరిగిన సరే.. యంగ్‌గా కనిపించాల ?  వృద్ధాప్యాన్ని రాకుండా చేసే  సీక్రెట్ హెల్త్ టిప్స్ ఇవే!

వయసు పెరిగినా సరే ఎప్పటికి  ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని అనుకుంటున్నారా ? అయితే దానికి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు.. మనం నిత్య జీవితంలో చేసుకునే కొన్ని చిన్న చిన్న మార్పులే మనల్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుతాయి.

హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ & ఎయిమ్స్ (AIIMS) వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్   వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేందుకు 6 అద్భుతమైన అలవాట్లను చెప్పుకొచ్చారు. వీటిని ఎంత చిన్న వయసులోనే ప్రారంభిస్తే అంత మంచిదని ఆయన సూచిస్తున్నారు.

1. వారానికి 2-3 సార్లు  
వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం మందగించకుండా ఉండాలన్నా, ఎముకలు గట్టిపడాలన్నా, బాడీ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉండాలన్నా కండరాల బలం చాలా అవసరం. అందుకే వారానికి కనీసం రెండు నుండి మూడు సార్లు వెయిట్ లిఫ్టింగ్ లేదా రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయాలని  చెబుతున్నారు.

2. ప్రతి భోజనంలోనూ తగినంత 
కేవలం రాత్రి టైంలో కాకుండా, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ప్రతి భోజనంలోనూ 25 నుండి 35 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, గ్రీక్ పెరుగు, పప్పు ధాన్యాలు, టోఫు, పనీర్, చేపలు లేదా చికెన్ ద్వారా ఈ ప్రోటీన్‌ను పొందవచ్చు.

3. రోజుకు 30 గ్రాములు
జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా, మలబద్ధకం తగ్గాలన్నా, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలన్నా పీచు పదార్థం (ఫైబర్) చాలా కీలకం. ప్రతిరోజూ 30 గ్రాముల ఫైబర్ ఉండేలా ఆహారం తీసుకోవాలి. అయితే ఫైబర్ వాడకం పెంచేటప్పుడు తగినంత నీరు కూడా తాగడం మర్చిపోకూడదు.

4. ప్రోటీన్, ఫైబర్  
ఉదయాన్నే జ్యూస్‌లు, పేస్ట్రీలు, మైదాతో చేసిన పదార్థాలు తింటే కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. అందుకే ఉదయం టిఫిన్లో  25-35 గ్రాముల ప్రోటీన్, 10 గ్రాముల ఫైబర్ ఉండేలా ప్లాన్  చేసుకోవాలి. బెర్రీస్, చియా గింజలతో కూడిన గ్రీక్ పెరుగు లేదా గుడ్లు, హోల్-గ్రెయిన్ టోస్ట్ వంటివి బెస్ట్ అప్షన్స్.

ALSO READ : మహాలయ పక్షంలో పితృ దేవతలను ఎందుకు పూజించాలి..

5. టైం చూసి  తాగండి
 లిమిట్ లో కాఫీ తాగడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 2 నుండి 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం మంచిదే కానీ, నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు సాయంత్రం వేళల్లో కాఫీకి దూరంగా ఉండాలి.

6. ఆహారంలో చియా గింజలు 
ప్రతిరోజు దినచర్యలో 1 నుండి 2 స్పూన్ల చియా గింజలను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 కొవ్వులు, దాదాపు 10 గ్రాముల ఫైబర్ అందుతాయి. వీటిని నీటిలో నానబెట్టి గానీ, పెరుగు లేదా ఓట్‌మీల్‌లో కలుపుకొని  తినవచ్చు.

ఈ ఆరు సాధారణ అలవాట్లను రోజు తప్పకుండా పాటిస్తే.. వయసు పెరిగినా నిత్య యవ్వనంతో, పూర్తి ఆరోగ్యంతో జీవించవచ్చని డాక్టర్ స్పష్టం చేస్తున్నారు.