సుమారు 10 కిలోల చికెన్‌ను డస్ట్ బిన్లో పారేశారు.. కరీంనగర్‌లోని మండి, షావర్మా రెస్టారెంట్లలో ఇంత ఘోరమా..?

సుమారు 10 కిలోల చికెన్‌ను డస్ట్ బిన్లో పారేశారు.. కరీంనగర్‌లోని మండి, షావర్మా రెస్టారెంట్లలో ఇంత ఘోరమా..?

కరీంగనర్‎లోని మండి, షావర్మా రెస్టారెంట్లలో ఆహార భద్రత అధికారులు శుక్రవారం (నవంబర్ 13) ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నాలుగు రెస్టారెంట్లలో రా ఎగ్ మయోనైజ్ కాకుండా వెజ్ మయోనైజ్ వాడుతున్నట్లు గుర్తించారు. అరేబియన్ కిచెన్, క్వాలిటీ మండి రెస్టారెంట్లలో వంటగది పరిశుభ్రత, ఆహార నిల్వలో లోపాలు ఉన్నట్లు తేల్చారు అధికారులు. క్వాలిటీ మండి రెస్టారెంట్‌లో చికెన్ వంటకాలకు సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

సింథటిక్ రంగులు ఉపయోగించిన సుమారు 10 కిలోల చికెన్‌ను అక్కడికక్కడే పారబోశారు అధికారులు. ప్రజల ఆరోగ్యంతో చెలగాలమాడుతూ నిబంధనల ఉల్లంఘించిన రెండు రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. FSSAI నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై తనిఖీలు, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు అధికారులు.