చిన్నారికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సైకిల్ గిఫ్ట్..మాట ఇచ్చిన 36 గంటల్లోనే సైకిల్ అందజేత

చిన్నారికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సైకిల్ గిఫ్ట్..మాట ఇచ్చిన 36 గంటల్లోనే సైకిల్ అందజేత

పెద్దపల్లి, వెలుగు: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. హామీ ఇచ్చిన 36 గంటల్లోనే ఐదో తరగతి విద్యార్థిని సాయి విజ్ఞతకు గురువారం సైకిల్ను బహుమతిగా అందజేశారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎంపీ, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లాస్థాయి రీడింగ్ కాంపిటీషన్లో మొదటి బహుమతి సాధించిన సాయి విజ్ఞత ప్రతిభను అభినందించి, సైకిల్ బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం కేవలం 36 గంటల్లోనే తన అనుచరుల ద్వారా బాలికకు సైకిల్ అందజేశారు. దీంతో సాయి విజ్ఞత ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపింది. మాట నిలబెట్టుకున్న ఎంపీకి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.