125 కిలోల చెత్త నుంచి ఆరు సిలిండర్ల గ్యాస్.. ఎంఎంసీ ఆఫీసులో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం..

125 కిలోల చెత్త నుంచి ఆరు సిలిండర్ల గ్యాస్.. ఎంఎంసీ ఆఫీసులో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం..
  • 3 కిలోలీటర్ల  సేంద్రియ ఎరువు కూడా.. 

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెత్తను సంపదగా మార్చే లక్ష్యంతో  ఎంఎంసీ హెడ్ ఆఫీసులో  ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను కమిషనర్  వినయ్ కృష్ణారెడ్డి,  సీఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌–-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రెడ్డి గురువారం ప్రారంభించారు. ఖార్స్ ఎనర్జీ ఆప్టిమైజర్స్ సంస్థ సహకారంతో ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. రోజుకు 125 కిలోల ఆహార వ్యర్థాలను ప్రాసెస్ చేసి నెలకు ఆరు కమర్షియల్ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ సిలిండర్లకు సమానమైన బయోగ్యాస్‌‌‌‌‌‌‌‌తో పాటు 3 కిలోలీటర్ల  సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేయనున్నారు. 

హెడ్డాఫీసు పరిసరాల్లోని హోటళ్ల నుంచి సేకరించిన ఆహార వ్యర్థాలను ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో వినియోగిస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే బయోగ్యాస్‌‌‌‌‌‌‌‌ను ఇక్కడే మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్‌‌‌‌‌‌‌‌లో వంటకు ఉపయోగించనున్నారు. సేంద్రియ ఎరువును కార్పొరేషన్ పార్కులు, పచ్చదనం పెంపునకు వినియోగించనున్నారు. 

ప్లాంట్‌‌‌‌‌‌‌‌తో నెలకు సుమారు 4.5 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు కూడా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని చెత్తను వనరుగా మార్చుకోవాలని కమిషనర్ సూచించారు.