- గతంతో పోల్చితే తగ్గిన డిమాండ్
- రూ. 33 కోట్ల ఆదాయం
కూకట్పల్లి, వెలుగు: హౌసింగ్‌బోర్డు వెస్ట్రన్డివిజన్పరిధి కేపీహెచ్‌బీకాలనీ పదిహేనో ఫేజ్‌లోని ఖాళీ ప్లాట్లకు గురువారం హౌసింగ్‌బోర్డు వేలం నిర్వహించింది. ప్లాట్ల వేలాన్ని అడ్డుకుంటామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హెచ్చరించటంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య వేలం కొనసాగించారు. ఎల్ఐజీ, ఎంఐజీ 22 ప్లాట్లకు వేలం నిర్వహించగా, 11 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ప్లాట్ల కనీస ధర రూ. 1.40 లక్షలుగా నిర్ణయించగా ఒక్క ఎల్ఐజీ ప్లాట్‌నెంబర్103 మాత్రమే 2.18 లక్షలకు గజం పలికింది.
మొత్తం వేలంలో విక్రయించిన ప్లాట్ల ద్వారా హౌసింగ్‌బోర్డుకు రూ. 33 కోట్ల ఆదాయం చేకూరింది. గతంలో కేపీహెచ్‌బీకాలనీలోని ఏడో ఫేజ్లో నిర్వహించిన రేటు కంటే ఈసారి తక్కువ వచ్చింది. గతంలో వేలం వేసిన ప్లాట్లు కమర్షియల్కాగా గురువారం వేలం వేసింది అక్కడక్కడా మిగిలిన చిన్న విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అని, అందుకే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని హౌసింగ్‌బోర్డు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా కాలనీలోని చేపల మార్కెట్ వద్ద ఉన్న 2696 చదరపు గజాల ప్లాట్‌కు కూడా వేలం నిర్వహించాల్సి ఉండగా 18వ తేదీ వరకు వేలం వేయవద్దని హైకోర్టు ఆదేశించటంతో ఆగిపోయింది.
