రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ప్రారంభించారు. ఈ కార్యకమంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన చేస్తున్నారని విప్ ఆదిశ్రీనివాస్ అన్నారు. నిత్యం ఆయన 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తున్నరని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా 8,209 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేస్తున్నామన్నారు.
ఇప్పటికే అందిస్తున్న పెన్షన్లకు కొత్తగా మంజూరైన పెన్షన్లు కలిపి ప్రతి నెలా ఒక కోటి 21లక్షల 473 మందికి పెన్షన్లు ప్రభుత్వం అందిస్తున్నది..పెన్షన్ల కోసం నెలకు సుమారు రూ.25.97 కోట్ల నిధులు కేటాయిస్తున్నాం.
పేదల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన గరీబీ హటావో, బ్యాంకుల జాతీయీకరణ, గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు రూ.75 వేల కోట్లు కాగా, గత పదేళ్లలో అప్పులు రూ.8.12 లక్షల కోట్లకు పెరిగింది.
గతంలో ఏడాదికి సుమారు రూ.6 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.72 వేల కోట్ల వడ్డీ భారం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.
ALSO READ : నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు . మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంది..
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ.. ఈ నెల 19 తేదీన నుండి ఇందిరమ్మ ఆత్మీయ భీమా పథకం అమలు చేస్తామని తెలిపారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
