Allu Arjun: హ్యాపీ బర్త్‌డే క్యూటీ.. 'రాకా' బిజీలోనూ సీక్రెట్ వెకేషన్.. స్నేహారెడ్డితో అల్లు అర్జున్!

Allu Arjun: హ్యాపీ బర్త్‌డే క్యూటీ.. 'రాకా' బిజీలోనూ సీక్రెట్ వెకేషన్.. స్నేహారెడ్డితో అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం  దర్శకులు అట్లీ,  లోకేష్ కనగరాజ్ తో కలిసి చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో బన్నీ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యతలో ఎప్పుడూ ముందే ఉంటారు. లేటెస్ట్ తన భార్య స్నేహారెడ్డి పుట్టిరోజును అత్యంత ప్రత్యేకంగా, రొమాంటిక్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

సముద్ర తీరంలో అందమైన సూర్యాస్తమయం (Sunset) వేళ, ఇద్దరూ తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ దిగిన ఈ లవ్లీ ఫోటోను పంచుకున్నారు అల్లు అర్జున్... 'హ్యాపీ బర్త్‌డే క్యూటీ' అంటూ పిలిచి భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ జంట ప్రస్తుతం ఎక్కడో సీక్రెట్ లొకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ పోస్ట్‌కు అయాన్, అర్హలతో పాటు మిలియన్ల మంది అల్లు ఫ్యాన్స్, సెలబ్రిటీలు స్నేహారెడ్డికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘రాకా’ (Raaka) ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్ వరల్డ్ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి, ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయంలో మెప్పించబోతున్నారని  టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందాన, మృణాల్ ఠాకూర్ వంటి నాయికలు నటించనుండగా, యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ట్యూన్స్ అందిస్తున్నారు.

►ALSO READ | SHAHID OTT Delay: 2 జాతీయ అవార్డులు గెలిచిన ‘షాహిద్’.. OTTలోకి రావడానికి 13 ఏళ్లు ఎందుకు పట్టింది?

ఇప్పటికే ముంబయి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2027లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీనితో పాటు లోకేష్ కనగరాజ్ కాంబోలో AA23, అట్మోస్ఫెరిక్ మాస్ ప్రాజెక్ట్ పుష్ప 3: ది రాంపేజ్ లైన్‌అప్‌లో ఉండటంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు బాక్సాఫీస్ వద్ద మరోసారి పూనకాలు తెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు..