T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరుగుతున్న కీలక సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ బౌలింగ్ చేయడంతో.. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం.. ఈ స్టేడియంలో తేమ ఎక్కువగా ఉంది, డ్యూ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. పిచ్ చాలా బాగుంది.. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు, గత మ్యాచ్‌లో ఆడిన టీమ్ తోనే బరిలోకి దిగుతోందని వెల్లడించాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. పిచ్ మంచిగా బ్యాటింగ్ కి అనుకూలంగా కనిపిస్తోందని.. బంతితో శుభారంభం చేయాలని ఆశిస్తున్నాం.. ఈ మైదానంపై భారత్‌కు అనుభవం ఎక్కువగా ఉంది.. కానీ టీ20 క్రికెట్ అనిశ్చితులతో కూడినది అని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టులో ఒక మార్పు మాత్రమే చేసింది. రేహాన్ స్థానంలో జేమీ ఓవర్టన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు బ్రూక్ తెలిపాడు.
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
