పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ లో కీలక పరిణామం.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా

పశ్చిమ బెంగాల్  పాలిటిక్స్ లో కీలక పరిణామం.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా

పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గురువారం(మార్చి5) రాజీనామా చేశారు. బోస్ రాజీనామాను గవర్నర్ కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. పదవీకాలం ముగియక ముందే అసెంబ్లీ ఎన్నికల వేళ బోస్ రాజీనామా సర్వత్రా చర్చనీయాంశమైంది. బోస్ స్థానంలో గవర్నర్ గా ఆర్ ఎన్ రవి ని కేంద్ర హోంశాఖ నియమించింది. 

ఢిల్లీ పర్యటనలో  ఉన్న బోస్ అక్కడే  తన రాజీనామా సమర్పించారు. బోస్ రాజీనామానుగవర్నర్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) ధృవీకరించారు.మేము ఢిల్లీలో ఉన్నాం.. గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతి భవన్‌కు పంపారు అని ఓఎస్డీ చెప్పారు. నవంబర్ 17, 2022న బాధ్యతలు చేపట్టిన బోస్ పదవీకాలం నవంబర్ 2027 వరకు ఉంది.   రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం బోస్ రాజీనామా ఆమోదించినట్లు తెలుస్తోంది.   

గవర్నర్ పదవికీ బోస్ రాజీనామా పై  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.  నేను షాక్ అయ్యాను.. బోస్  రాజీనామా వెనక కారణాలు తెలియలేదు.. మరికొన్ని  వారాల్లో అసెంబ్లీ ఎన్నికలుండగా  రాజకీయ ప్రయోజనాలకోసం గవర్నర్ పై కేంద్ర హోంశాఖ ఒత్తిడి చేసి ఉండొచ్చని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.  ఇది రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తుందన్నారు. రాష్ట్రాల గౌరవాన్ని దెబ్బతీసే  ఏక పక్ష నిర్ణయం అని మమత అన్నారు.

►ALSO READ | మహారాష్ట్రలో వాహనాల సమ్మె: అర్ధరాత్రి నుండి బస్సులు, టాక్సీలు, ఆటోలు బంద్.. ప్రయాణికులపై ఎఫెక్ట్ !