ఇంట్లో  పనిమనుషులను గుడ్డిగా నమ్మకండి.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక

 ఇంట్లో  పనిమనుషులను గుడ్డిగా నమ్మకండి.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక

ఇంట్లో పనిచేసే మనుషులను గుడ్డిగా నమ్ముతున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే! పనిమనుషుల నియామకంలో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. హైదరాబాద్ నగరంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి.

గత రెండేళ్లలో నగరవ్యాప్తంగా ఏకంగా 565 సర్వెంట్ థెఫ్ట్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ టాలీవుడ్, బిజినెస్ ప్రముఖులు నివసించే జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 173 కేసులు నమోదుకావడం గమనార్హం.

ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, విద్యార్థులే ప్రధానంగా టార్గెట్‌గా మారుతున్నారు. నేరస్థులు పనిమనుషుల వేషంలో ఇళ్లలోకి ప్రవేశించి, సులువుగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. యజమానుల అజాగ్రత్తే ఈ దొంగతనాలకు ప్రధాన కారణమని సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక సూచనలు చేసింది. ఇళ్లలో పనిమనుషులను పెట్టుకునే ముందు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హెచ్చరిస్తోంది.