సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది..‘‘దేశం ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదు.. ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదు. దేశ పౌరులమైన మాది..అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రశ్నించే హక్కు మాకుంది.. ప్రభుత్వాలను ప్రశ్నించడం, పారదర్శకత కోరడం ప్రతి పౌరుడి హక్కు. జవాబుదారీతనం ముఖ్యం’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. దేశపౌరులను ఆలోచింపజేసేలా, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి హక్కు, బాధ్యతను గుర్తు చేసేలా ఉన్న ఈ పోస్టుపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
ఈ పోస్టులో.. మోదీ, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతల ఫొటోలతో స్లైడ్ షో పెట్టారు. దీంతోపాటు ‘‘ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎకౌంటబిలిటీ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు డిమాండ్ చేయాలని కోరారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా మేం ప్రశ్నలు అడుగుతాం.. ఆప్ (AAP) అధికారంలో ఉన్నా ప్రశ్నలు అడుగుతాం.. బీజేపీ పాలన సాగించినా సరే, మేం ప్రశ్నలు అడుగుతాం..ఎందుకంటే ఈ దేశం పౌరులది, ఏ రాజకీయ పార్టీదో లేదా ఏ ఒక్క వ్యక్తిదో కాదు.. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, పారదర్శకతను కోరడం, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం అనేవి కేవలం ప్రతిపక్షం చేసే పనులు కావు..అవి ప్రతి పౌరుడి బాధ్యత ,హక్కు.’’ మీరేమంటారు? అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, ప్రతి ప్రభుత్వం పట్ల జవాబుదారీతనం విషయంలో ఒకే ప్రమాణాన్ని పాటించాలి అంటూ రాశారు. ఈ విషయంపై భారత దేశ పౌరుల అభిప్రాయాన్ని కోరారు.
ఉవ్వెత్తున్న ఎగిసిపడిన జెన్ Z ఉద్యమం సక్సెస్ కావడం.. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేటుకున్నాయి. దీంతో పాటు యువత ఆలోచనలు మరింత మార్పును కోరుకుంటున్నాయడానికి ఈ పోస్ట్ ఒక ఉదాహరణ. upscworldofficial అనే ఎకౌంట్ తో ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్టు.. ఇంటర్నెట్ లో పెద్ద చర్చకు దారీ తీసింది.
ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే వేలల్లో నెటిజన్లు స్పందించారు. ప్రభుత్వాల ఎకౌంటబిలిటీ పై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రభుత్వాల జవాబుదారీతనం ,విద్యావ్యవస్థలో ప్రక్షాళనకు ప్రతిపౌరుడు నిర్వహించాల్సిన బాధ్యతపై చర్చించారు.
ప్రభుత్వాలను జవాబుదారీ తనం కోరడం మన హక్కు. ప్రతిపౌరుడు వర్చువల్ ప్రతిపక్షం పాత్రను పోషించాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
విద్యా వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దేశ పౌరులందరూ కలిసికట్టుగా నిలబడాలి..ప్రభుత్వం ఎవరైనప్పటికీ అనవసరం.. కావలసింది స్వచ్ఛమైన విద్యా వ్యవస్థ మాత్రమే. అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
