బాత్రూమ్ టైల్స్‌పై మరకలు పొవట్లేదా ? క్లీనర్లు అక్కర్లేదు.. ఇంట్లోని ఈ వస్తువులతో చిటికెలో మెరిసిపోతాయి..

 బాత్రూమ్ టైల్స్‌పై మరకలు పొవట్లేదా ? క్లీనర్లు అక్కర్లేదు.. ఇంట్లోని ఈ వస్తువులతో చిటికెలో మెరిసిపోతాయి..

బాత్‌రూమ్‌లో టైల్స్ తెల్లగా, మెరుస్తూ ఉంటేనే ఇల్లు శుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఎంత క్లీన్ చేసినా, తేమ వల్ల టైల్స్ మీద, మూలల్లో నల్లటి మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని వదిలించడం కొంచెం కష్టమే అనిపిస్తుంది కదూ! కానీ మీ ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే ఈ నల్లటి మరకలను ఇట్టే వదిలించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దామా.....

1. బేకింగ్ సోడా మ్యాజిక్
బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు పోసి చిక్కని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నల్లటి మరకలు ఉన్న చోట రాసి పది నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత ఒక బ్రష్‌తో మెల్లగా రుద్దితే మరకలు మాయం అవుతాయి.

2. వెనిగర్ స్ప్రే
ఒక స్ప్రే బాటిల్‌లో సమానంగా తెల్ల వెనిగర్, నీళ్లు పోసి కలపండి. మరకలు ఉన్న టైల్స్ మీద దీన్ని బాగా స్ప్రే చేయండి. కొద్దిసేపు ఆగి మరకలు మెత్తబడిన తర్వాత ఒక కాటన్ గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.

3. హైడ్రోజన్ పెరాక్సైడ్
ఎప్పటికి పోకుండా గట్టిగా పట్టుకున్న ముదురు మరకలపై నేరుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయండి. అది నురగలా వచ్చి అందులో ఉండే మురికిని బయటకు లాగుతుంది. కొన్ని నిమిషాలు ఆగి గట్టి బ్రష్‌తో రుద్దితే టైల్స్ తళతళలాడతాయి.

4. నిమ్మరసంతో మెరుపు
తాజా నిమ్మరసాన్ని మరకలు ఉన్న చోట రాయండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ ఒక మంచి క్లీనర్‌లా పనిచేసి, సబ్బు మరకలను, నలుపును పోగొడుతుంది. అంతేకాదు, బాత్రూమ్ అంతా మంచి నిమ్మ సువాసన వస్తుంది.

5. మ్యాజిక్ ఎరేజర్  
మార్కెట్లో దొరికే మెలమైన్(melamine) ఫోమ్ స్పాంజ్‌ను కొద్దిగా తడిపి, మరకలు ఉన్న ప్రదేశంలో గుండ్రంగా రుద్దండి. టైల్స్‌కు ఎలాంటి గీతలు పడకుండా, పైనున్న నల్లటి మరకలను ఇది ఈజీగా తొలగిస్తుంది.

 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.