మహారాష్ట్రలో వాహనాల సమ్మె: అర్ధరాత్రి నుండి బస్సులు, టాక్సీలు, ఆటోలు బంద్.. ప్రయాణికులపై ఎఫెక్ట్ !

మహారాష్ట్రలో వాహనాల సమ్మె: అర్ధరాత్రి నుండి బస్సులు, టాక్సీలు, ఆటోలు బంద్.. ప్రయాణికులపై ఎఫెక్ట్ !

మహారాష్ట్రలో ఈ-చలాన్లు, పెరిగిన పన్నులకు నిరసనగా రవాణా వాహనదారులు సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో, ఈరోజు (మార్చ్ 5) అర్ధరాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర రవాణా యాక్షన్ కమిటీ (M-TAC) ప్రకారం.. ఈ సమ్మె వల్ల  ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్, ట్యాక్సీలు, ఆటోలు  నిలిచిపోనున్నాయి. స్కూల్ బస్సులు కూడా శుక్రవారం నుండి పూర్తిగా నిలిచిపోవచ్చు.  ట్రక్కులు, టెంపోలు, ట్యాంకర్లు కూడా ఆగిపోనున్నాయి, దింతో సరుకు రవాణా ఆగిపోతుంది. 

సమ్మెకు  కారణం, డిమాండ్లు :
రవాణాదారులు ముఖ్యంగా  ఈ-చలాన్ (E-Challan) వ్యవస్థపై మండిపడుతున్నారు. వీరి  డిమాండ్లు ఏంటంటే పార్కింగ్ స్థలాల్లో ఉన్న వాహనాలకు కూడా భారీగా జరిమానాలు వేస్తున్నారని, వాటిని రద్దు చేయాలని కోరుతున్నారు. అలాగే  వాణిజ్య వాహనాలపై టోల్ ఫీజులు, ఇతర పన్నులను తగ్గించాలని... దినితో పాటు 45 రోజుల్లోపు జరిమానాలు కట్టకపోతే వాహన పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఆపేస్తామనే నిబంధనను తొలగించాలని..... హైవేలపై డ్రైవర్లకు విశ్రాంతి గదులు, అత్యవసర సదుపాయాలు కల్పించాలి కోరుతున్నారు.  పానిక్ బటన్లు, సీసీ కెమెరాలు వంటివి అమర్చాలనే నిబంధనల వల్ల ఖర్చు పెరిగిపోతోందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

►ALSO READ | ఖమేనీ మృతిపై.. తొలిసారి స్పందించిన భారత్

ప్రభుత్వంతో చర్చలు:
మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ రవాణాదారులతో చర్చలు జరిపారు. తప్పుగా పడిన చలాన్లను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాతపూర్వకమైన హామీలు, స్పష్టమైన నిర్ణయాలు వెలువడకపోవడంతో సమ్మెను కొనసాగించాలని యూనియన్లు నిర్ణయించాయి. ఈ సమ్మె ప్రభావంతో శుక్రవారం నుండి సామాన్య ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు కలగడమే కాకుండా, పాలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల రవాణాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.