ఖమేనీ మృతిపై.. తొలిసారి స్పందించిన భారత్

ఖమేనీ  మృతిపై.. తొలిసారి స్పందించిన భారత్

మాజీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారిగా స్పందించింది. ఖమేనీ మరణంపై భారత ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిశ్రీ భారత్ తరపున సంతాపం తెలిపారు.

అలీ ఖమేనీ మృతిపట్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా అధికారికంగా తన సంతాపాన్ని తెలిపింది. గురువారం (మార్చి 5) ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీని సందర్శించిన విక్రం మిశ్రీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ స్మారకార్థం ఏర్పాటు చేసిన సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఖమేనీ మరణం పట్ల భారత్ తరఫున సంతాప సందేశాన్ని నమోదు చేశారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చెందిన 86 ఏళ్ల మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ 1989 నుంచి దేశానికి నాయకత్వం వహించారు. గత శనివారం తెల్లవారుజామున అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సైనిక దాడుల్లో ఖమేనీ మృతి చెందారు. 

►ALSO READ | యుద్దంతో కాదు..చర్చలతోనే సమస్యలు పరిష్కారం: ప్రధాని మోదీ