IND vs ZIM: హరారే వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల స్కోరు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో ముందుకు నడిపించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడో టీ20లోనూ విఫలమయ్యాడు. దీంతో ఈ సిరీస్ ఆఖరి పోరులో గెలవడానికి జింబాబ్వే ముందు భారత్ 193 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
వైభవ్ 102 మీటర్ల సిక్స్:
15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఏకంగా 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. వికెట్ పడుతుందనే భయం లేకుండా ఆడిన వైభవ్, 81 పరుగుల వద్ద అవుట్ అయి తృటిలో తన తొలి అంతర్జాతీయ సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ, సూర్యవంశీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో భారత జట్టు భారీ స్కోరు సాధించడానికి స్ట్రాంగ్ పూనాది వేశాడు.
నిరాశపరిచిన అభిషేక్ శర్మ:
ఒకవైపు వైభవ్ చెలరేగిపోగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్, ఈ మూడో టీ20లోనూ 2 పరుగులకే నిష్క్రమించి ఫ్లాప్ షోను కొనసాగించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమవ్వడం అతని ఫామ్‌పై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ (29), శ్రేయస్ (27), తిలక్ (11), రింకు సింగ్ (25) బాధ్యతయుతంగా బ్యాటింగ్ చేశారు.
3–0తో క్లీన్‌స్వీప్ చేసే దిశగా భారత్:
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ తో భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం జింబాబ్వేకు అంత ఈజీ కాదు. ఇప్పటికే సిరీస్‌ను 2–0 తేడాతో కైవసం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ సేన, ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని కట్టడి చేసి 3–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (వైట్‌వాష్) చేయాలని పట్టుదలతో ఉంది.
A solid batting effort led by Vaibhav Sooryavanshi's fabulous knock 🔝
— BCCI (@BCCI) July 26, 2026
Over to our bowlers to defend 1️⃣9️⃣2️⃣ runs 🎯
Scorecard ▶️ https://t.co/oApMpI6eRc#TeamIndia | #ZIMvIND pic.twitter.com/20TaeRyVxk
