భక్తుడితో అనుచిత ప్రవర్తన.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

భక్తుడితో అనుచిత ప్రవర్తన.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్

తిరుమలలోని జీఎన్‌సీ ప్రాంతంలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శరత్ బాబును శనివారం టీటీడీ సస్పెండ్ చేసింది. ఓ భక్తుడితో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ఉద్యోగి ప్రవర్తన రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన టీటీడీ, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.