హైదరాబాద్‌లోని ప్రముఖ జాతీయ సంస్థ అయిన సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ) టెక్నీషియన్ గ్రేడ్-–II పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 21 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు: టెక్నీషియన్ గ్రేడ్–II.
మొత్తం ఖాళీలు: 21(అన్ రిజర్వ్డ్–15, ఈడబ్ల్యూఎస్–02, ఎస్సీ–03, ఎస్టీ–01).
విద్యార్హత
గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టులతో పదో తరగతి లేదా సమాన పరీక్షలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా నేషనల్/ స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఫుల్-టైమ్ అప్రెంటిస్‌షిప్ అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థలు, పీఎస్‌యూలు, అటానమస్ బాడీలు లేదా సంబంధిత రంగాల్లో సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
ఐటీఐ ట్రేడ్లు
ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ / ఐటీ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ & నెట్‌వర్క్ మెయింటెనెన్స్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, లేబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్, ఫిజియోథెరపీ టెక్నీషియన్, క్యాటరింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 04
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ngri.res.inను సందర్శించవచ్చు.
సెలెక్షన్ ప్రాసెస్
అప్లికేషన్ స్క్రీనింగ్: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది.
ట్రేడ్ టెస్ట్: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు వారి సంబంధిత ట్రేడ్‌లో ప్రాక్టికల్ / నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
రాత పరీక్ష : ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో పేపర్–-I, పేపర్–-II, పేపర్–-III అనే మూడు విభాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, సంబంధిత ట్రేడ్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. తుది మెరిట్ జాబితాను కేవలం పేపర్-–II, పేపర్-–IIIలో సాధించిన మార్కుల ఆధారంగానే ఖరారు చేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
మెడికల్ ఎగ్జామినేషన్: నిబంధనల ప్రకారం వైద్య పరీక్ష నిర్వహించి తుది నియామకం చేపడతారు.
►ALSO READ | విదేశాల్లో చదివిన యువతకు గుడ్‌న్యూస్: యాక్సిస్ బ్యాంక్ కొత్త రిక్రూట్మెంట్ లాంచ్!
