జ్యోతిష్యం:సెప్టెంబర్8 మహాఅద్భుతం..మూడు యోగాలు..శివపూజ..పాపాలు ఫట్.. ఐశ్వర్యం వృద్ధి

జ్యోతిష్యం:సెప్టెంబర్8 మహాఅద్భుతం..మూడు యోగాలు..శివపూజ..పాపాలు ఫట్.. ఐశ్వర్యం వృద్ధి

జ్యోతిష్యశాస్త్రంలో  గ్రహాల కలయిక వలన కొన్ని యోగాలు ఏర్పడుతాయి.  సెప్టెంబర్​ 8 వ తేది మంగళవారం.. ఈ ఏడాది ( 2026) చివరి మంగళవారం.. ఆరో జు  మూడు యోగాలు ఏర్పడుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రదోష కాలంలో పరమశివుడిని పూజించడం వల్ల పాపాలు తొలగి, ధైర్యసాహసాలు.. ఐశ్వర్యం పెరగడంతో పాటు రుణ, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్​ 8 వ తేదీన  సర్వార్ద సిద్ద యోగం.. పరిఘ యోగం..శివ యోగం.. ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. 

పరిఘ యోగం:  2026 సెప్టెంబర్ 8  ఉదయం నుండి రాత్రి 12:40 గంటల వరకు 
 శివ యోగం: 2026 సెప్టెంబర్ 8 మధ్యాహ్నం 1.10 గంటల నుంచి  రాత్రి 8.32 గంటల వరకు 
సర్వార్థ సిద్ధి యోగం: 2026  సెప్టెంబర్ 8 సాయంత్రం 4:39 నుంచి సెప్టెంబర్ 9 ఉదయం 6:03 గంటల వరకు 

ఈ యోగాల కారణంగా ఈరోజు చేసే ఏ పూజ లేదా శుభకార్యమైనా వంద రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. 

పూజకు  అద్భుతమైన సమయం

శివారాధనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదోష కాలంలో భక్తులకు సుమారు రెండు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు అత్యంత శుభప్రదమైన సమయం దక్కుతుంది.

పూజా సమయం: సెప్టెంబర్ 8న సాయంత్రం 6:35 గంటల నుంచి రాత్రి 8:52 గంటల వరకు.
ఈ  సమయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో శివలింగానికి జలాభిషేకం, క్షీరాభిషేకం చేసి బిల్వపత్రాలు, పూలతో పూజించాలి. 

భౌమ ప్రదోష వ్రతం రోజున ( 2026 సెప్టెంబర్​ 8) శివుడిని పూజిస్తే ప్రస్తుత జన్మలో.. గత ఏడు జన్మల్లో చేసిన పాపాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. దగ్గరలోని శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని పూజించాలి. స్వామి వారికి  పాలు, బిల్వపత్రాలు, ధతూరా, తెల్లని పూలు, అక్షతలు సమర్పించాలి.

►ALSO READ | ఆధ్యాత్మికం: మణిపూసలలో గీతా మకరందం.. సాహితీ ప్రపంచానికి కొత్త కోణంలో పరిచయం

ఆవు నెయ్యితో దీపం వెలిగించి 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపం చేయాలి.  స్వామి వారికి షోడశోపచారాలతో, అష్టోత్తరంతో   పూజ చేయాలి.  ఆ తరువాత  తెల్లని మిఠాయిలను, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.  ఇలా చేయడం వలన  పాపాలు తొలగి.. జాతక దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.