24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేస్తాం: నార్సింగి పోలీసులు

24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేస్తాం: నార్సింగి పోలీసులు

హైదరాబాద్: బాసింగ బలాలు ఫేమ్ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, డ్యాన్సర్ మాధురి రాథోడ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆమె మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్టేట్‌మెంట్ ఇచ్చింది.

కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతోనే ఆమె తీవ్ర మనస్తాపానికి  గురైంది. అయితే ఈశ్వర్ సాయిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం” అని పోలీసులు హామీ ఇచ్చారు. 

ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసు నమోదు అనంతరం ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు, అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నారు. అలాగే ముందస్తు బెయిల్ కోసం ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.