ఇటీవల బాచుపల్లిలో వ్యాపార లావాదేవీల కారణంగా కారుకు నిప్పంటించిన కేసు కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆదివారం ( సెప్టెంబర్ 6 ) నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బాచుపల్లి పోలీసులు, ఎస్ఓటీ బృందాలు చందానగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్ 3న జీపీఆర్ వెంచర్ లో పార్క్ చేసిన ఫార్చ్యూనర్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అశోక్ రెడ్డి. రియల్ ఎస్టేట్ ప్లాట్ల కొనుగోలు, అమ్మకాల వివాదంలో బాధితుడిని భయపెట్టడానికే అశోక్ రెడ్డి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించి, నేరానికి ఉపయోగించిన బీవైడీ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
