గుహను వీడిన సింహం కూన.. మైత్రీ బ్యానర్లో మోక్షజ్ఞ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..

గుహను వీడిన సింహం కూన.. మైత్రీ బ్యానర్లో మోక్షజ్ఞ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు శుభం కార్డు పడింది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు విఘ్నాలన్నీ తొలగిపోయాయి. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులు శుభవార్త విన్నారు. మోక్షజ్ఞ తొలి సినిమా ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ‘మైత్రీ మూవీ మేకర్స్’ విడుదల చేసింది. ‘‘సింహం కూన గుహను వీడింది.. ఇప్పుడు అది సింహంగా అడవిలోకి ప్రవేశిస్తుంది’’ అని ఒక ఆసక్తికర క్యాప్షన్తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు.

►ALSO READ | బాలయ్య సినిమా టైటిల్ ‘దాదా’.. ఒక్క డైలాగ్తో ఫ్యాన్స్ ఫిదా..!

కంప్లీట్ అవ్వగానే ఒక మంచి ముహూర్తం చూసుకుని.. మోక్షజ్ఞతో సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. తొలి సినిమా ‘బింబిసార’తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ట్రాక్ రికార్డ్ వశిష్టకు ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. రెండో సినిమా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం.. మూడో సినిమా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేసే అవకాశం.. విశ్వంభర సినిమా వర్కౌట్ అయితే టాలీవుడ్లో మరో డైరెక్టర్ టాప్5 లిస్ట్లో చేరిపోయినట్టే.