తిరుమల చేరుకున్న అంబానీ EV బస్సులు : ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్

తిరుమల చేరుకున్న అంబానీ EV బస్సులు : ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మరో కీలక ముందడుగు పడుతోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ టీటీడీకి విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు తిరుపతికి చేరుకున్నాయి. వీటిలో ఓ బస్సును ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్డులో ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సు పనితీరు, భద్రతా ప్రమాణాలను టీటీడీ అధికారులు పరిశీలించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా అనంత్ అంబానీ... టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్‌ను అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీ కార్యరూపం దాల్చుతోంది. పర్యావరణహిత ప్రయాణంతో పాటు భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్న ఈ విద్యుత్ బస్సులను శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

►ALSO READ | నమో వెంకటేశా : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెయ్యేళ్ల చరిత్ర.. 966 సంవత్సరంలో ఏం జరిగిందో తెలుసా..!