వైఎస్ షర్మిల కూతురి పెళ్లి ఫిక్స్.. ఆమెకు కాబోయే అల్లుడి బ్యాగ్రౌండ్ ఇదే!

వైఎస్ షర్మిల కూతురి పెళ్లి ఫిక్స్.. ఆమెకు కాబోయే అల్లుడి బ్యాగ్రౌండ్ ఇదే!

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డికి పెళ్లి నిశ్చయం అయిందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. డాక్టర్. సోమల రఘురామ్ రెడ్డి అనే అమెరికాలో స్థిరపడిన యువ వైద్యుడితో తన కూతురికి పెళ్లి ఫిక్స్ అయినట్లు ఆమె చెప్పారు.

సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మా రెడ్డి దంపతులు కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. వీళ్ల కొడుకే డాక్టర్. సోమల రఘురామ్ రెడ్డి. ఈ కుటుంబానికి అమెరికా పౌరసత్వం ఉంది. ఈ కుటుంబం ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడింది.

పెళ్లి తేదీని వెల్లడించనప్పటికీ త్వరలోనే ఈ వివాహం జరగనుందని షర్మిల ట్వీట్తో స్పష్టమైంది. స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆశీర్వచనాలు ఈ జంటకు ఉండాలని షర్మిల ఆకాంక్షించారు.

షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17, 2024లో షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం జరిగింది. ఇప్పుడు కూతురికి పెళ్లి నిశ్చయం కావడంతో.. దాదాపు రెండేళ్ల తర్వాత వైఎస్ షర్మిల ఇంట మరోసారి పెళ్లి సందడి నెలకొంది.

►ALSO READ | శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం... ఆరుద్ర నక్షత్రం రోజున మల్లన్నకు ప్రత్యేక పూజలు

రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న షర్మిల.. కూతురి పెళ్లితో కుటుంబంతో మధుర క్షణాలను గడపబోతున్నారు. మనవరాలికి పెళ్లి నిశ్చయం కావడంతో విజయమ్మ సంతోషం వ్యక్తం చేశారు. రాజారెడ్డి పెళ్లిలో విజయమ్మకు తగిన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. విజయమ్మతో.. రాజారెడ్డి, అతని భార్య ప్రియ కలిసి ఉన్న ఫొటోలను కూడా షర్మిల అప్పట్లో సోషల్ మీడియాలో పంచుకున్నారు.