నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వైభంగా శ్రీస్వామి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరిగింది. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున స్వర్ణ రథోత్సవాన్ని దేవస్థాన అధికారులు శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు,ట్రస్ట్ బోర్డు మెంబర్లు చేశారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగిన ఆది దంపతులు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీశైల క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రం రోజున స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ఈ సందర్భంగా వేకువజామునే ఆలయ తలుపులు తెరిచి, అర్చక స్వాములు ఆది దంపతులకు విశేషార్చనలు చేశారు. ముఖ్యంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరమేశ్వరుడికి ప్రత్యేక పూజల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ విశేష పూజల అనంతరం, ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వర్ణ రథాన్ని సర్వాంగ సుందరంగా, రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.
