ఏ సమస్య వచ్చిందో.. స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు

ఏ సమస్య వచ్చిందో..  స్టడీ సర్కిల్ మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు

స్టడీ సర్కిల్ లో గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. 2026 సెప్టెంబర్ 06వ తేదీన ఉదయం.. స్వామి రాము అనే యువకుడు స్టడీ సర్కిల్ మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.   తీవ్రమైన గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు.

స్వామి రాము గత కొంత కాలంగా  గ్రూప్స్ పౌండేషన్  కోచింగ్  తీసుకుంటున్నాడు.  నిన్నటి వరకు బానే ఉన్నాడని.. సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తోటి విద్యార్థులు చెబుతున్నారు.  కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమని అధికారులు చెబుతున్నారు.

 గతకోన్ని రోజులుగా  కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి చెందిన స్వామి రాము మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.