- నిర్మల్ డీసీసీ అధ్యక్షుడుఎమ్మెల్యే బొజ్జు పటేల్
- ఖానాపూర్ నుంచి నిర్మల్ వరకు ర్యాలీ
నిర్మల్/కరీంనగర్/మల్లాపూర్, వెలుగు: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే 2028లోనూ తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా నిర్మల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల ఇన్చార్జీలు శ్రీహరిరావు, నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కాంగ్రెస్ నేతలతో కలిసి ఖానాపూర్ నుంచి నిర్మల్వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఏర్పాటుచేసిన సభలో బొజ్జు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీలకు లేదన్నారు. పీసీసీ కార్యదర్శి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు.
కాంగ్రెస్సంబురాలు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఇందిరా చౌక్ లో నిర్వహించిన ఈ సంబురాల్లో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తు పాల్గొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నర్సింగరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య కేకు కట్ చేశారు. మండల అధ్యక్షుడు సోమయ్య, కాంగ్రెస్ నాయకులు జువ్వడి కృష్ణారావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జలపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
