జూబ్లీహిల్స్ కారా కారా పబ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు గ్రూపులు

జూబ్లీహిల్స్ కారా కారా పబ్లో  పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు గ్రూపులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కాకా కారా పబ్ లో భారీ గొడవ జరిగింది. 2026 సెప్టెంబర్ 06వ తేదీ అర్థరాత్రి జరిగిన ఘర్షణ భయాందోళనకు గురిచేసింది. 150 మంది రెండు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

 కారా కారా పబ్ లో తెల్లవారుజామున 2 గంటలకు రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు పబ్ నిర్వహికులు చెబుతున్నారు. సుమారు 150 మంది వరకు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పబ్ అద్దాల తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. 

 సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.