హైదరాబాద్ లో పనీర్ కల్తీపై TG సేఫ్  దాడులు... పాలు లేకుండానే పనీర్ తయారీ.. రెండు డైరీల లైసెన్స్ రద్దు..

హైదరాబాద్ లో పనీర్ కల్తీపై TG సేఫ్  దాడులు... పాలు లేకుండానే పనీర్ తయారీ.. రెండు డైరీల లైసెన్స్ రద్దు..

హైదరాబాద్ లో మరోసారి కల్తీ పనీర్ బాగోతం బయటపడింది. TG సేఫ్ అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం ( సెప్టెంబర్ 5 ) నిర్వహించిన ఈ ఆకస్మిక దాడులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... హైదరాబాద్ లోని 14 డైరీ యూనిట్లలో 12 బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించారు TG సేఫ్ అధికారులు. ఈ క్రమంలో పలు డైరీల్లో పనీర్ తయారీలో పామ్ ఆయిల్, గ్లైరోసెల్, మోనోస్టెరెట్ వినియోగాన్ని గుర్తించారు అధికారులు.

పలు డైరీల్లో కల్తీ అనుమానంతో 21 శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు అధికారులు. మైలార్ దేవ్ పల్లిలోని ధన లక్ష్మీ డైరీ, ఆల్వాల్ లోని నటరాజ్ మిల్క్ అండ్ మిల్క్ ఫుడ్ ప్రాడక్ట్స్ లైసెన్స్ లను రద్దు చేశారు అధికారులు. ఈ దాడుల్లో మొత్తం 7.19 లక్షల టన్నుల ఆహార పదార్థాలు, 476 కిలోల గ్లైసెరోల్ మోనోస్టేరేట్ సీజ్ చేసి.. ఒక టన్ను పామ్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.

►ALSO READ | అత్తాపూర్ లో అర్థరాత్రి విధ్వంసం... బైకులు, కార్లను గుద్దుకుంటూ వెళ్లిన డీసీఎం డ్రైవర్..

పలు డెయిరీల్లో బొద్దింకలు, ఈగలతో తీవ్ర అపరిశుభ్రత గుర్తించామని.. పాల కొనుగోలు వివరాల రికార్డులు కూడా లేవని తెలిపారు అధికారులు. మూడు డైరీలకు సంబందించిన FSSAI లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. 

లైసెన్సులు సస్పెండ్ చేసిన యూనిట్లలో వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేశామని.. మరో రెండు డైరీలకు షోకాజ్ నోటీసులు, రెండు యూనిట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు  జారీ చేసినట్లు తెలిపారు. రీ ఇన్ స్పెక్షన్ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.