కొలనూరు–రామన్నపేట హై లెవల్ బ్రిడ్జి పనులు స్పీడప్ చేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

కొలనూరు–రామన్నపేట  హై లెవల్ బ్రిడ్జి పనులు స్పీడప్ చేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
  •      విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు–రామన్నపేట గ్రామాల మధ్య మంజూరైన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను స్పీడప్ చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం బ్రిడ్జి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. 

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమవడంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు ముమ్మరం చేయాలని, నాలుగు నెలల్లోగా బ్రిడ్జి పూర్తి చేయాలని ఆదేశించారు.