అమెరికాకు చెందిన బాహుబలి యుద్దనౌక అబ్రహాం లింకన్ ఇప్పుడు తుప్పు సమస్యను ఎదుర్కొంటుంది. శాన్ డియాగోలు ఆరునెలల క్రితం ఉన్న యుద్దనౌకలా లేదు.. ఇరాన్ యుద్దం లో గత ఆరునెలలుగా కీ రోల్ పోషించిన ఈ నౌక ఇప్పుడు తుప్పు పట్టి రిపేర్ కు వచ్చింది. మరమ్మతులకోసం థాయ్ ఓడరేవుకు చేరింది.
గత ఆరు నెలలుగా సముద్రంలో నిలిచి ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తింది. గత నవంబర్‌లో శాన్ డియాగో నుండి ఇరాన్ కు వచ్చిన ఈ యుద్ద నౌక 286 రోజుల యుద్దంలో పాల్గొన్నది. ఇప్పుడు మునుపటి యుద్ధనౌకలా కాకుండా తుప్పు పట్టి మరమ్మతుల కోసం థాయ్ ఓడరేవుకు చేరింది. తుప్పు తొలగింపునకు సాండింగ్, ప్రైమింగ్ , పెయింటింగ్‌తో సహా 30 రోజుల పని అవసరమంటున్నారు. ప్రస్తుతం థాయ్ ఓడరేవులో ఉన్న యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ కు అక్కడే మరమ్మతులు చేసే అవకాశం కనిపిస్తోంది.
చాలా కాలం సముద్రంలో నిలిచి ఉండటమే దీనికి కారణమంటున్నారు నావికులు. 60 రోజులకు పైగా నిరంతర సముద్ర కార్యకలాపాలు సాగించే ఓడలలో నీటిమట్టం వెంబడి తుప్పు పట్టడం సాధారణమంటున్నారు.
యూఎస్ ఎస్ అబ్రహాం లింకన్ 1989లో తన సేవలు ప్రారంభించింది. ఇది అణు రియాక్టర్లతో నడుస్తుంది. ఇంధనం లేకుండా 20నుంచి 25 ఏళ్లు ప్రయాణించగలదు. ఈ నౌక సుమారు 1092 అడుగుల పొడువుతో 5వేల మందికి పైగా నావికులు , సైనిక సిబ్బంది పనిచేస్తారు. దీనిపై 80 నుంచి 90 వరకు యుద్ద విమానాలు, హెలికాప్టర్లు మోహరించవచ్చు.
