అతనో పొలిటికల్ లీడర్.. హంగామా మామూలుగా ఉండదు.. బయటకొస్తే పెద్ద కారులోనే వస్తారు.. చుట్టూ 20 మంది కార్యకర్తలతో హడావిడి చేస్తుంటారు.. ఇక ఎమ్మెల్యేనో.. మంత్రినో వస్తే మాత్రం పెద్ద పెద్ద బ్యానర్లు కడతాడు.. ఘనంగా స్వాగతం పలుకుతాడు.. పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలో అచ్చం అలాగే ఉంటాడు.. మెడలో పెద్ద బంగారపు గొలుపు.. చేతికి ఉంగరాలు.. కడియాలు.. అబ్బో అలా ఇలా ఉండడులే.. ఇంత పెద్ద పొలిటికల్ లీడర్ మెడలోని 7 లక్షల రూపాయల విలువైన బంగారం గొలుసు కొట్టేశారు కంత్రీగాళ్లు.. మంచి స్కెచ్ వేసి.. అదును చూసి లాక్కెళ్లారు.. విషయం ఏంటో తెలుసా.. మెడలోని బంగారం గొలుసు కొట్టేసిన విషయం అతను చూసుకునే వరకు తెలియలేదు.. అంటే ఎంత చాకచక్యంగా లేసేశారో కదా.. ఈ ఘటన జరిగింది ఎక్కడ.. ఎప్పుడు.. ఆ బాధిత పొలిటికల్ లీడర్ ఎవరు అనేది వివరంగా తెలుసుకుందామా..
అది బీహార్ ఆరోగ్య మంత్రి నిశాంత్ కుమార్ కు ఏర్పాటు చేసిన వెల్కమ్ ప్రొగ్రాం. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున వచ్చారు. తమ నాయకుడి కోసం ఎగబడ్డారు. ఇది సాధారణంగా రాజకీయ నేతలు వస్తే జరిగే తంతు అందరికి తెలుసు.. అయితే ఈ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
జేడియూ పార్టీకి ముఖ్యనేతల్లో ఒకరైన రాజేష్ మండల్ మెడల్లోంచి బంగారు చైన్ కొట్టేశారు దొంగలు. అంతమంది కార్యకర్తల మధ్యలో కూడా అతనికి తెలియకుండా 7లక్షల విలువైన గోల్డ్ చైన్ మాయం చేశారు కేటుగాళ్లు. మంత్రికి పూలమాల వేసే సమయంలో జరిగిన గందరగోళంలోనే బంగారు గొలుసు మాయమైందని మండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ మండల్ చైన్ వెతికే పనిలో పడ్డారు. అంతమంది కార్యకర్తల మధ్య దొంగ అంత చాకచక్యంగా ఎలా గొలుసు దొంగిలించాడా అన్నదే పోలీసులకు కూడా అంతుచిక్కట్లేదట మరీ.
