ఫేక్ సర్టిఫికేట్ ఉపయోగించి ఉద్యోగం సంపాదించిన వ్యక్తికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) సర్టిఫికేట్ ద్వారా బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో ఉద్యోగం పొందిన వ్యక్తికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పదవీ విరమణ చేసేందుకు అనుమతించింది. 2026 సెప్టెంబర్ 5న జరిగిన విచారణలో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఫేక్ ఎస్టీ సర్టిఫికేట్ తో జూనియర్ సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించిన షిరీష్ పి. పాటిల్ అనే ఈ ఇంజనీర్‌కు అన్ని పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించూ విరమించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
షిరీష్ పి. పాటిల్ అనే వ్యక్తి 1984లో టోక్రే కోలి అనే ఎస్టీ కమ్యూనిటీకి చెందినవాడని చెప్పి సర్టిఫికేట్ తీసుకున్నాడు. 1994లో MCGMలో జూనియర్ సివిల్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యాడు. 2000లో అసలు సర్టిఫికేట్ పోయిందని చెప్పి భుసావల్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి తెలివిగా కొత్త సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు.
అయితే MCGM దర్యాప్తులో పాటిల్ పూర్వీకులు కోలి, హిందూ కోలి, హిందూ సూర్యవంశీ కోలి వర్గానికి చెందినవారని, వీరు ST కేటగిరీలోకి రారని తేలింది. 2009లో కారణం చూపమని నోటీసు ఇచ్చినా, పాటిల్ వకీళ్లు, కుటుంబ సభ్యులు లేరన్న కారణాలతో 2020 వరకు దర్యాప్తును ఆలస్యం చేశారు. చివరకు 2020లో కమిటీ సర్టిఫికేట్‌ను రద్దు చేసింది. హైకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
ఈ మధ్యలో పాటిల్ 30 జూన్ 2025 వరకు సేవలు అందించి, 30 ఏళ్లకు పైగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. సర్టిఫికేట్ రద్దు, కోర్టు ప్రక్రియల తర్వాత కేసు సుప్రీం కోర్టుకు చేరింది. పాటిల్ చాలా కలంగా చేసిన సేవను పరిగణనలోకి తీసుకుని సుప్రీం కోర్టు ఉద్యోగం నుంచి తొలగించకుండా, అన్ని పెన్షన్, రిటైర్‌మెంట్ ప్రయోజనాలతో స్వచ్ఛంద విరమణకు అనుమతించింది.
