జెప్టో, బ్లింకిట్ లాంటి క్విక్ కామర్స్ యాప్స్ కి జనం బాగా అలవాటు పడ్డారు. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో డెలివరీ, దీనికి తోడు ఆఫర్లు ఉండటంతో చాలామంది వీటిపైనే డిపెండ్ అవుతున్నారు. అయితే.. జనాల వీక్నెస్ ని ఆసరా చేసుకున్న ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ నాసిరకం సరుకు, గడువు ముగిసిన వస్తువులు అంటగడుతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలోని మంగళూరులో కూడా ఇదే జరిగింది. బ్లింకిట్ లో ఆర్డర్ చేసిన గుడ్లలో పురుగులు వచ్చాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ కస్టమర్. దీంతో ఆ బ్లింకిట్ స్టోర్ ను సీజ్ చేశారు అధికారులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బ్లింకిట్ ద్వారా డెలివరీ చేసిన కొన్ని గుడ్లు పాడైపోయాయని, వాటిలో ఒకదానిలో పురుగు కనిపించిందని ఓ కస్టమర్ ఫిర్యాదు చేసిన సంగతి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్‌కు దృష్టికి వెళ్ళింది. ఫిర్యాదు ఆధారంగా, ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళూరులో ఫాల్నిర్ ప్రాంతంలో ఉన్న ఫాల్నిర్ స్క్వేర్ బిల్డింగ్ లో ఉన్న బ్లింకిట్ స్టోర్ ను తనిఖీ చేశారు.
►ALSO READ | ఎస్టోనియా రక్షణ మంత్రి కొంపముంచిన భారత కంపెనీతో డీల్.. రూ.769 కోట్ల స్కాం అని తేలడంతో రాజీనామా !
ఈ తనిఖీల్లో సదరు స్టోర్ లో పగిలిన గుడ్లు ఉన్న ప్యాకెట్లను గుర్తించారు అధికారులు. పగిలిన గుడ్లు ఉన్న ప్యాకెట్లను వెంటనే స్టోర్ నుంచి తీసేయాలని ఆదేశించారు అధికారులు. స్టోర్ ని క్లీన్ చేసి, శానిటైజ్ చేసేంతవరకు స్టోర్ ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ స్టోర్ నిర్వాహకులకు బ్లింకిట్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు.
