టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్యూర్, ఎమోషనల్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. తాజాగా ఆ కోవలోనే మరో యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ 'డియర్ హార్ట్' (Dear Heart) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ లీడ్ రోల్స్ వహిస్తున్న ఈ చిత్రాన్ని జీడీ నరసింహా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ మోషన్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం మూవీ టీమ్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ చెబుతూ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ మోషన్ పోస్టర్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్స్ నిజంగా గుండెలకు హత్తుకునేలా ఉన్నాయి. "కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి.. కానీ కొన్ని కథలు కాలం ఉన్నంత వరకు గుర్తుంటాయి.. నా చివరి శ్వాస వరకు.. నా గుండె కొట్టుకున్న ప్రతీసారి ఆ చప్పుడు చెప్పే ఒకే ఒక్క పేరు.. నీదే!" అంటూ సాగిన లైన్స్ ప్రతీ ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అరవింద్ బి విజువల్స్ ఈ మోషన్ పోస్టర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.
►ALSO READ | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ల నడుమ మళ్లీ లొల్లి.. రఘు మాస్టర్ ప్యానెల్పై సుమలత ఫిర్యాదు
ఈ చిత్రంలో పృధ్వీ రాజ్, సత్య ప్రకాష్, జబర్దస్త్ నూకరాజు, సురేష్ గురు, జగదీశ్వరి వంటి క్రేజీ నటీనటులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. లక్ష్మణ్ టేకుమూడి, అజయ్ యార్లగడ్డలు అందించిన కథ, మాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ప్రేమ, విరహం, ఎమోషన్ కలబోతగా వస్తున్న ఈ '‘డియర్ హార్ట్' త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేయడానికి రెడీ అవుతోంది..
