India vs Japan: భారత క్రీడా ప్రపంచంలో ఎవరూ ఊహించని ఒక చారిత్రాత్మక ప్రకటనను బీసీసీఐ (BCCI) వెల్లడించింది. రాబోయే సెప్టెంబర్ 22వ తేదీన భారత్, జపాన్ పురుషుల జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగబోతోంది. సీనియర్ స్థాయిలో ఈ రెండు దేశాల జట్లు ముఖాముఖి పొట్టి ఫార్మాట్‌లో తలపడటం క్రికెట్ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న టీమిండియా, ఇప్పుడిప్పుడే ఈ ఆటలో అడుగులు వేస్తున్న జపాన్‌తో ఆడే ఈ సుజుకి కప్ పోరుకు తోచిగి ప్రావిన్స్‌లోని ప్రసిద్ధ సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
మోడీ-తకైచి స్పోర్ట్ 75 ప్లాన్.. దౌత్య బంధానికి క్రికెట్ ఊపు:
ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, దీని వెనుక అంతర్జాతీయ వ్యూహం దాగి ఉంది. భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని సనా యె తకైచిల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో స్పోర్ట్ 75 అనే ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. క్రీడల ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని పెంచడమే కాకుండా, 2036లో భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న ఒలింపిక్స్ ఆశయానికి జపాన్ నుంచి సాంకేతిక, మౌలిక వసతుల సహకారం పొందడమే ఈ మ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
తూర్పు ఆసియాలో క్రికెట్ విస్తరణ.. బీసీసీఐ బిగ్ గేమ్ ప్లాన్:
ఈ అరుదైన మైలురాయిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా సంతోషం వ్యక్తం చేశారు. జపాన్ గడ్డపై అడుగుపెట్టి టీమిండియా మ్యాచ్ ఆడటం అనేది ఆసియా ఖండంలో క్రికెట్ భవిష్యత్తును మార్చే అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. సాంప్రదాయక క్రికెట్ దేశాలకే పరిమితం కాకుండా తూర్పు ఆసియా ప్రాంతంలోనూ క్రికెట్‌కు ప్రజాదరణ పెంచేందుకు బీసీసీఐ వేస్తున్న ఈ అడుగులు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ మ్యాచ్ ద్వారా జపాన్ యువతకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగి, ఆసియా నుంచి మరిన్ని కొత్త జట్లు వెలుగులోకి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
►ALSO READ | భారత చీఫ్ సెలెక్టర్ కావాలంటే అర్హతలేంటి? అగార్కర్ సీటుపై సస్పెన్స్ వేళ సంచలన విషయాలు!
2036 ఒలింపిక్స్ లక్ష్యం.. ఇరు దేశాల మధ్య బలపడనున్న బంధం:
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడానికి భారత్ చాలా పట్టుదలతో శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో ఎంతో అనుభవం ఉన్న జపాన్ లాంటి అగ్రదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పుకోవడంతో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాల మార్పిడి వేగవంతమవుతాయి. సెప్టెంబర్ 22న జపాన్‌లోని సానో మైదానంలో జరగబోయే ఈ టీ20 మ్యాచ్ కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇతర క్రీడలకు కూడా ఈ భాగస్వామ్యం విస్తరించి రెండు దేశాల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని బీసీసీఐ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
𝗛𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗜𝗻 𝗧𝗵𝗲 𝗠𝗮𝗸𝗶𝗻𝗴!
— BCCI (@BCCI) September 4, 2026
India🇮🇳 🤝 Japan🇯🇵#TeamIndia set to play a historic T20I against Japan to launch the celebrations of the 7️⃣5️⃣th Anniversary of India-Japan Diplomatic Relations. 👏👏@CricketJapan
All The Details 🔽https://t.co/vxdhuT1tgp pic.twitter.com/DQmPncvefH
