MS Dhoni: టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌లు తమ సన్నిహితులతో కలిసి హోటల్ రూమ్‌లో సరదాగా సమయం గడుపుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రైవేట్ వీడియోలో పంత్ తన స్నేహితులతో కలిసి రిలాక్స్డ్‌గా ముచ్చటిస్తూ కనిపించగా, వెనుక ఉన్న ధోనీ రిభష్ కు షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించాడు. ఆ తర్వాత తాను కిందకు హుక్కా తాగడానికి వెళ్తున్నానని పంత్‌తో చెప్పి, అక్కడే ఉన్న ఒక పెద్దాయనకు పదాభివందనం (కాళ్లకు నమస్కరించి) చేసి అక్కడి నుంచి వెళ్లడం వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది.
టేబుల్‌పైబీర్ క్యాన్లు, కాక్‌టైల్స్.. కాళ్లు మొక్కిన ధోనీ:
ఈ పార్టీకి సంబంధించిన విజువల్స్ టేబుల్‌పై రకరకాల బీర్ క్యాన్లు, కాక్‌టైల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంత్ తన పక్కన ఉన్న ఒక పెద్దాయనతో సరదాగా ముచ్చటిస్తుండగా, ధోనీ అక్కడికి వచ్చి తాను హుక్కా తాగేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. ఎంత సరదాగా గడుపుతున్నప్పటికీ, తనకంటే వయసులో పెద్దవాడైన వ్యక్తికి ధోనీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అభిమానుల మనసు దోచుకుంది. సరదా క్షణాల్లో కూడా ధోనీ చూపిన ఈ సాంప్రదాయ బద్ధమైన గౌరవంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎవరీ కుల్జిందర్ బాహియా?:
ఈ వీడియోలో ధోనీ కాళ్లకు నమస్కరించిన ఆ పెద్దాయన ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన మరెవరో కాదు, యూకేలోని ప్రముఖ ప్రాజెక్ట్ సంస్థ సౌత్ ఆల్ ట్రావెల్ (Southall Travel) సీఈఓ, యజమాని అయిన బ్రిటిష్-ఇండియన్ వ్యాపారవేత్త కుల్జిందర్ బాహియా. ఎంఎస్ ధోనీకి కుల్జిందర్‌తో సుదీర్ఘకాలంగా మంచి స్నేహబంధం ఉంది. ధోనీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుల్జిందర్ కుటుంబంతో తరచూ సమయం గడుపుతుంటాడు.
ALSO READ : అభిషేక్ శర్మ కాదు.. వైభవ్ సూర్యవంశీకి సరైన ఓపెనింగ్ జోడి అతడే!
కృతి సనన్ డేటింగ్ రూమర్స్:
ఈ వైరల్ వీడియోలో కుల్జిందర్ బాహియా కుమారుడు కబీర్ బాహియా కూడా కనిపించడం మరో విశేషం. ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్‌తో కబీర్ బాహియా ప్రేమలో ఉన్నట్లు (డేటింగ్) గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా కూడా ధోనీ, పంత్‌లతో కలిసి కబీర్ బాహియా స్టాండ్స్‌లో కనిపించాడు. మైదానంలోనూ, బయట కూడా ధోనీ, పంత్‌లతో ఈ బిజినెస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఈ వీడియో ద్వారా మరోసారి నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.
Rishabh Pant & MS Dhoni drinking beer worth more than 12 crore 🥶
— Ansh (@159atsydney_) September 2, 2026
During eng vs india last odi game rishabh pant sponsored a super luxury house party for dhoni and his villagers friends and served beer and wine worth more than 12 crores ❤️🔥 pic.twitter.com/7FsXpZ8mn8
