హైదరాబాద్ లో ఫేక్ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టయ్యింది. ఫేక్ నోట్లు తయారు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు కేటుగాళ్లు. పక్కా సమాచారంతో శుక్రవారం ( సెప్టెంబర్ 4 ) రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు ఫేక్ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
ఫేక్ నోట్ల తయారీపై సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ అవ్వడంతో రంగంలోకి దిగారు హైదరాబాద్ పోలీసులు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు బాలాపూర్ లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి రూ.2 లక్షల 91 వేల విలువజేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.నాలుగు రూ.500, నాలుగు రూ.100 నోట్లతో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
ALSO READ : KTR ఫెయిల్డ్ లీడర్.. అతడి వల్లే బీఆర్ఎస్కు వరుస ఓటములు
ఈ ముఠా సుమారు రూ.10 వేల నకిలీ నోట్లు చలామణీ చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లే టార్గెట్ గా నకిలీ నోట్ల చలామణీకి పాల్పడుతున్నట్లు తెలిపారు పోలీసులు.ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నిర్వాహకులకు లేఖలు రాశారు పోలీసులు. ఫేక్ నోట్ల తయారీ విడియోలపై వివరణ ఇవ్వాలని కోరారు పోలీసులు.
