బర్త్ డే సెలెబ్రేషన్స్ ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. స్తోమతను బట్టి ఇంట్లో ఫ్యామిలీ, బంధువులతో కలిసి కేక్ కట్ చేసి జరుపుకునేవారు కొంతమంది అయితే... గ్రాండ్ గా జరుపుకునేవారు ఇంకొంతమంది.చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు బర్త్ డే స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకోవడం కామన్. అయితే కొంతమంది ఇంట్లో పెంచుకునే కుక్కలకు, పిల్లులకు కూడా బర్త్ డే సెలెబ్రేట్ చేస్తారు. యూపీలో ఓ వ్యక్తి కూడా ఇలాగే అలోచించి బర్రెకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేట్ చేశాడు. ఊళ్ళో వారందరినీ పిలిచి ప్రత్యేక వేడుకగా బర్రె బర్త్ డే చేశాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యూపీలోని బల్లియా జిల్లాలోని బద్గావ్ గ్రామంలో రాజేష్ కుమార్ వర్మ తన పెంపుడు గేదె బసంతి నాలుగో పుట్టినరోజును గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించాడు. రంగురంగుల బెలూన్లతో స్టేజి అలంకరించి.. బర్రెకు పూల దందా వేసి తలపై “హ్యాపీ బర్త్‌డే” టోపీ పెట్టి రెడీ చేశాడు. అనంతరం గారమస్తుల సమక్షంలో రెండు కేకులు కట్ చేయించాడు.
Happy Birthday Basanti
— Raajeev Chopra (@Raajeev_Chopra) September 3, 2026
UP man throws party for his beloved buffalo pic.twitter.com/1Xxk2Js0s3
కేక్ కట్ చేస్తుండగా, గ్రామస్తులు చప్పట్లు కొడుతూ, “హ్యాపీ బర్త్ డే బసంతి!” అని కేకలు వేశారు. ఆ తర్వాత వర్మ, బసంతికి కేక్ ముక్కలు, అరటిపండ్లు తినిపించి, గ్రామస్తులకు స్వీట్లు పంచారు. తన పెంపుడు బర్రెపై ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరిచాడు రాజేష్.
ALSO READ : నెలకు రూ.80వేలు సంపాదిస్తే పేదరికంతో సమానమా?
తన గేదెను నా కుటుంబ సభ్యురాలిగా భావిస్తానని... దానిపై తనకున్న ప్రేమను విభిన్నంగా వ్యక్తపరచాలనుకున్నానని అంటున్నాడు రాజేష్. బర్రె పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
