ఓటీటీ ప్రేమికులకు పండగే పండగ.. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంట్లోనే చూసేయాలనుకునే ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరిపోయే ట్రీట్ రెడీ అయింది. కామెడీ, హారర్, యాక్షన్, క్రైమ్, బయోపిక్.. ఇలా ఒక్కో జానర్‌కు ఒక్కో స్పెషల్ మూవీ, వెబ్‌సిరీస్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 4న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కంటెంట్ పోటీ గట్టిగానే కనిపించనుంది ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏముందో ఓ లుక్కేద్దాం...
కొరియన్ కనకరాజు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ ' కొరియన్ కనకరాజు' ఆగస్టు 7, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఈ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతపురం కుర్రాడికి ఒక విచిత్రమైన కొరియన్ దెయ్యం పడితే ఎలా ఉంటుందనే వినూత్న కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంది. సత్య కామిక్ టైమింగ్, వరుణ్ తేజ్ యాక్షన్, రితికా నాయక్ గ్లామర్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్. థియేటర్‌లో మిస్సయిన వారు సెప్టెంబరు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా నవ్వుకోవచ్చు..
డీసీ - DC ..
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో నటించిన రేవెంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ'. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ సన్ నెక్ట్స్‌లో సెప్టెంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వామికా గబ్బి పవర్ ఫుల్ యాక్టింగ్, అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ రోలర్‌కోస్టర్ యాక్షన్ రైడ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ధమాల్ 4 ..
బాలీవుడ్ ఐకానిక్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 'ధమాల్ 4' నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రల్లో ఇంద్రకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ నవ్వుల పూదోట. నిధి వేట చుట్టూ తిరిగే ఈ గందరగోళపు ప్రయాణంలో మీ కుటుంబంతో కలిసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు..
జి.డి.నాయుడు ..
ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచిన మహోన్నత శాస్త్రవేత్త, ఆవిష్కర్త జి.డి.నాయుడు (GDN ) బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ఇది. వర్సటైల్ యాక్టర్ మాధవన్ శ్రమించి చేసిన ఈ డ్రామాలో దుషారా విజయన్, ప్రియమణి, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. స్ఫూర్తిదాయక కథల కోసం ఎదురుచూసే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఉన్మాదం ..
మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ వేరు. కుంచకో బోబన్, లిజోమోల్ జోసే నటనతో మైండ్ బ్లాంక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్ 'ఉన్మాదం'. థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ సినిమా సోనీలివ్ వేదికగా డిజిటల్ ప్రేమికులను భయపెట్టేందుకు వచ్చేస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime):
పళ్ళబురుసు (తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించిన ఎమోషనల్ విలేజ్ డ్రామా)
ది రన్నర్ (హాలీవుడ్ యాక్షన్ మూవీ.
జగమే సంగీతం (తెలుగు సిరీస్ - సెప్టెంబరు 4)
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11,
లవ్ సిక్,
వదల,
గాంధారి (హిందీ),
ది జెంటిల్‌మెన్: సీజన్ 2,
ది ప్రెసిడెంట్స్ కేక్.ఎ మినిక్రాఫ్ట్ మూవీ,
ఎర్లీ మీట్స్ వరల్డ్ (సెప్టెంబరు 4).
జీ5 (Zee5):
వీరభద్ర రహస్యం: పార్ట్ 2 (జీ5 తెలుగు సిరీస్ - సెప్టెంబరు 4)
జియో హాట్‌స్టార్ ( JioHotstar )
ది కోర్ట్ ( తమిళ వీక్లీ సిరీస్ - సెప్టెంబరు 4)
స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు
మొత్తానికి.. ఈ వీకెండ్ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఓటీటీ మారథాన్ చేయాలనుకునేవారికి నవ్వులు, భయాలు, యాక్షన్, థ్రిల్స్‌తో ఫుల్ ప్యాకేజీ రెడీ అయిపోయింది.
