- పాత కంప్యూటర్లకూ జియోపీసీ..
- రూ. వెయ్యితో జియోపీసీ సర్వీస్ లాంచ్ చేసిన రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన జియోపీసీ సేవల్ని దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఇప్పటివరకు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సబ్ స్క్రైబర్లకే పరిమితమైన ఈ సర్వీస్ ఇప్పుడు దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు జియోపీసీ, జియోపీసీ అల్ట్రా అనే రెండు వేరియంట్లలో లభిస్తాయి. వీటి ద్వారా పాత హార్డ్‌వేర్, తక్కువ స్టోరేజ్ కారణంగా స్పీడ్ తగ్గిన ఎనిమిదేళ్ల నాటి పాత కంప్యూటర్లు కూడా ఇకపై కొత్తవాటిలా పనిచేస్తాయి. హార్డ్‌వేర్ మార్చాల్సిన పనిలేకుండా కేవలం ఐదు నిమిషాల్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. భారీ ప్రాసెసింగ్ పనులన్నీ జియో సర్వర్లపైనే నడుస్తాయి కాబట్టి ఏఐ అప్లికేషన్లను కూడా సులభంగా రన్ చేయవచ్చు.
ఈ సేవలు రెండు ప్లాన్లలో లభిస్తాయి. బేస్ జియోపీసీ ప్లాన్‌లో 8జీబీ ర్యామ్, 500జీబీ స్టోరేజ్ లభిస్తుంది. దీని ధర 2 నెలలకు రూ. 1,000, 5 నెలలకు రూ. 2,000, 10+2 నెలలకు రూ. 4,000గా ఉంది. ఇక జియోపీసీ అల్ట్రా వేరియంట్‌లో 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ లభిస్తుంది. దీని ధర 2 నెలలకు రూ. 1,200, 5 నెలలకు రూ. 2,500, 10+2 నెలలకు రూ. 5,000గా ఉంది. కొత్త కంప్యూటర్ కొనుగోలు చేయలేని వారికి ఇదొక తక్కువ ఖర్చుతో కూడిన అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
