లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గురువారం సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ ‘కులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే, సమానమే అని చెప్పిన గొప్ప మహనీయుడు రామానుజాచార్యులు. ఆయన గొప్పతనం తెలియజేసే చిత్రమిది. ఇందులో 11 పాత్రల్లో కనిపిస్తాను’ అని చెప్పారు. నిర్మాణ బాధ్యతలు వహిస్తూనే కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించానని ప్రవళ్లిక అన్నారు. టీఎఫ్ పీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, డైరెక్టర్ సముద్ర, నిర్మాతలు రామసత్యనారాయణ, మోహన్ గౌడ్ పాల్గొని ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.
