ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ..ట్రావెల్ విభాగంలోకి ఎంట్రీ

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ..ట్రావెల్ విభాగంలోకి ఎంట్రీ
  • ట్రావెల్ విభాగంలోకి స్విగ్గీ ఎంట్రీ

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ, ట్రావెల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘క్రూ’  పేరుతో ప్రీమియం ట్రావెల్ కాన్సియర్జ్  సేవలను (పర్సనల్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌) గురువారం ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేవలు ప్రత్యేకంగా పెయిడ్ మెంబర్లు, ఇన్విటేషన్ పంపిన ప్రయాణికులకు మాత్రమే క్రూ యాప్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయి. గతేడాది వ్యక్తిగత కాన్సియర్జ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభమైన క్రూ, వినియోగదారుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఆధారంగా ట్రావెల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోకి విస్తరించినట్లు సంస్థ తెలిపింది.