ముంబై: భారీ స్థాయిలో డాలర్ డిపాజిట్లు రావడంతో రూపాయి విలువ వరుసగా ఐదో రోజూ బలపడింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో 22 పైసలు బలపడి 94.51 వద్ద స్థిరపడింది. దేశంలో ఫారెక్స్ నిల్వలు పెంచేందుకు ఆర్‌బీఐ చేపట్టిన ప్రత్యేక పథకం ద్వారా రికార్డు స్థాయిలో 127.23 బిలియన్ డాలర్ల ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్లు వచ్చాయి. ఎక్స్‌టర్నల్ బారోయింగ్స్‌తో కలిపి మొత్తం ఇన్‌ఫ్లోలు 136.377 బిలియన్ డాలర్లకు చేరడం రూపాయికి బలాన్నిచ్చింది. అయితే, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 96.44 డాలర్లకు పెరగడంతో రూపాయి లాభం పరిమితంగా ఉంది. ఇదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ 417 పాయింట్లు నష్టపోయి 76,152.86 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు పడి 23,873.45 వద్ద సెటిలయ్యాయి.
