నిర్మాతల సంక్షేమమే మన ప్యానెల్ లక్ష్యం

నిర్మాతల సంక్షేమమే మన ప్యానెల్ లక్ష్యం

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో సి. కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ కీలక ప్రెస్‌‌మీట్ నిర్వహించింది. నిర్మాతల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని సి. కళ్యాణ్ తెలిపారు. తాము ఎన్నికైన వెంటనే మెడిక్లైమ్‌‌ను రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు చిన్న నిర్మాతలకు అండగా నిలుస్తామని చెప్పారు.

మని హామీ ఇచ్చావిద్య, వివాహాలకు ఆర్థిక సాయం, వృద్ధులకు పెన్షన్, మరణించిన నిర్మాతల కుటుంబాలకు సహాయం కొనసాగిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సినీ పరిశ్రమ సమస్యలపై చర్చిస్తామని, సినీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని సి. కళ్యాణ్ తెలియజేశారు. చిన్న సినిమాలకు ఓటీటీ  అవకాశాలు కల్పించేలా వెబ్‌‌సైట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.  ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. నిర్మాతల సమస్యల పరిష్కారం, పరిశ్రమ అభివృద్ధి కోసం తమ ప్యానెల్‌‌కు మద్దతు ఇవ్వాలని వారు నిర్మాతలను కోరారు.