ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ఇందులో ఎన్టీఆర్‌కు జంటగా నటించబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో కీలకపాత్ర కోసం అలియాను తీసుకోబోతున్నట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’లో అలియాభట్ కూడా నటించినప్పటికీ రామ్ చరణ్‌కు జంటగా ఆమె కనిపించింది. అయితే ఎన్టీఆర్, అలియా జోడి కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు.
‘డ్రాగన్’తో అది నెరవేరబోతోంది. అంతేకాక బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇందులో విలన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి ఎంపిక దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ జరగడంతో కొద్ది వారాల పాటు షూటింగ్‌కు బ్రేక్ పడింది. మరో రెండు వారాల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫిబ్రవరికి టాకీ పార్ట్ పూర్తి చేసి, ముందుగా ప్రకటించినట్టు జూన్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
