ఓల్డ్‌సిటీ, వెలుగు: బహదూర్‌పురాలోని ఖులీ కుతుబ్‌షా ప్రభుత్వ ఐటీఐ కాలేజీలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో కోర్సులకు సెప్టెంబర్ 5లోగా అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ రేణుక పేర్కొన్నారు. టెన్త్ లేదా ఆపై ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్సీఎన్సీ మెషీన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ డిజిటల్ మాన్యుఫాకర్చరింగ్ టెక్నీషియన్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సుల్లో 70 సీట్లు ఉన్నాయన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో జూపార్క్ సమీపంలోని పి.నర్సారెడ్డి కాలనీలో ఉన్న ఏటీసీకి వచ్చి, అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు.
